ప్రముఖ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్లలో ఈ భామ ఒకరని చెప్పవచ్చు. 1991లో పత్తర్ కె పూల్ అనే సినిమాతో హిందీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళంలో అనేక సినిమాలలో నటించింది. రవీనా టాండన్ వయసు పెరిగినా కూడా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది.

 రీసెంట్ గా రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను గతంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని రవీనా వెల్లడించారు. ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. తన సినిమాలోని హీరోతో అనుకోకుండా సినిమాలో లిప్ తాకడం వల్ల తాను వాంతులు చేసుకున్నానని రవినా సంచలన కామెంట్లు చేసింది. సినిమా షూటింగ్లో తనతో ఆ హీరో చాలా మిస్ బిహేవ్ చేశాడని చెప్పింది. ఆ సమయంలో అనుకోకుండా ఆ హీరో పెదవులు తగిలాయని, దానివల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. అది కిస్సింగ్ సీన్ కానప్పటికీ పొరపాటున జరిగిన సీన్ వల్ల చాలా బాధపడ్డానని చెప్పింది.

 ఆ సమయంలో నాకు చాలా వికారంగా అనిపించింది. దానిని నేను మర్చిపోలేకపోయాను. ఇంటికి వెళ్లి వాంతులు చేసుకున్నాను. అనేకసార్లు బ్రష్ చేసుకుని ముఖం కడుక్కున్నానని రవీనా చెప్పుకొచ్చింది. ఈ విషయం ఇప్పటికీ నన్ను బాదిస్తుందని ఎప్పటికీ నేను ఈ విషయాన్ని మర్చిపోలేనని రవీనా వెల్లడించారు. ప్రస్తుతం రవీనా టాండన్ షేర్ చేసుకున్న ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన రవీనా అభిమానులు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. సినీ పరిశ్రమ అంటే ఇలాంటివన్నీ చాలా కామెన్ మీకు ఇవన్నీ తెలిసి ఇలా మాట్లాడడం సరికాదని అంటున్నారు. దీనిపైన ఈ భామ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: