
అసలే ఇప్పుడు రీమేక్ లు సరిగ్గా ఆడడం లేదు. అలాంటి టైం లో ఈ భైరవం ఎంతవరకు ఆకట్టుకుంటుంది..? అనే డౌట్ అందరికీ వచ్చింది. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . మనోజ్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది అని.. ఫుల్ మాస్ గా అదరగొట్టేసాడు అని నారా రోహిత్ - బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు అని.. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కి పడిన మొదటి హిట్ ఇదేనని అంతున్నారు అభిమానులు. అసలు నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడి చాలా కాలం అవుతుంది అని .. నారా రోహిత్ అనే ఒక హీరో ఇండస్ట్రీలో ఉన్నాడు అంటూ ప్రూవ్ చేసేలా చేసింది ఈ భైరవం సినిమా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఫస్ట్ ఆఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ లవ్ ట్రాక్ ల వల్ల కథ లెంతీగా అనిపించిందే కానీ సెకండ్ హాఫ్ మాత్రం అద్దిరిపోయింది అని ఇంటర్వెల్లో సాలిడ్ ట్విస్ట్ ఉంటుంది అని .. ముగ్గురు హీరోలు కూడా తగిన న్యాయం చేశారు తమ పాత్రలకి అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే సినిమా చాలా బాగున్నా కూడా కొన్ని సైట్స్ మాత్రం సినిమాపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నాయి . నెగటివ్గా రివ్యూస్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా మంచు మనోజ్ నటన డమ్మీ అంటూ ఆయనని కావాలని ఎద్దేవా చేస్తూ మాట్లాడడం మనోజ్ ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా ఉంది .
అయితే దీని వెనక ఎవరో ఒక పెద్ద స్టార్ డబ్బులు ఇచ్చి ఇలా రాయించి ఉంటాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . అసలే మనోజ్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి పడకుండా వస్తుంది. ఆయనని లేపేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అలాంటి మూమెంట్లోనే మంచు మనోజ్ ఈజ్ బ్యాక్ అంటూ తన సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఆ హీరో చూసి ఓర్వలేకపోతున్నట్లున్నాడు .. అందుకే ఇలా డబ్బులు ఇచ్చి నెగిటివ్గా రివ్యూలు ఇప్పిస్తున్నాడు .. నెగిటివ్గా మాట్లాడిస్తున్నాడు అంటూ టాలీవుడ్ హీరో పై ఘాటుఘాటుగా మంచు మనోజ్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . ఎవరు ఏమనుకున్నా సరే భైరవం సినిమా మాత్రం పాజిటివ్ టాక్ అందుకునేసింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉండాయో చూడాలి అంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే..!