
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ ని కూడా రాబట్టింది. దీంతో భైరవం మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో బెల్లకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ చాలా రోజులకి బెల్లకొండ శ్రీనివాస్ కి, మంచు మనోజ్ మంచి సక్సెస్ అందుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మనోజ్, బెల్లంకొండ, రోహిత్ ల నటన బాగుంది. వారి యాక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ కూడా మస్తు అదరగొట్టారు. కానీ కొన్ని చోట్ల మాత్రం స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉన్నట్లు అనిపించింది. ఈ సినిమా ముఖ్యంగా యాక్షన్ ప్రియులకు నచ్చుతుంది. భైరవం మూవీకి 2.75 రేటింగ్ వచ్చింది.