2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి అద్భుతమైన అసెంబ్లీ స్థానాలు దక్కడంతో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్న సమయం లోనే కాపుల ఉద్యమాలు పెద్ద ఎత్తున మొదలు అయ్యాయి. అందులో భాగంగా ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలకు సంబంధించి అనేక కేసులు నమోదు అయ్యాయి. 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వై సి పి పార్టీ అధికారం లోకి వచ్చింది.

తెలుగు దేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత వై సి పి పార్టీ , తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కాపు ఉద్యమం కి సానుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చింది. ఇకపోతే 2024 వ సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో కాపు ఓటు బ్యాంకు టి డి పి వైపు మల్లుతుంది అని చాలా మంది అనుకున్నారు.

ఈ సారి జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో టి డి పి , జనసేన , బి జె పి కి అద్భుతమైన స్థాయిలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఇకపోతే చంద్రబాబు హయాంలో జరిగిన కాపు ఉద్యమం కి సంబంధించిన కొన్ని కేసులు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశాలు కనబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే అంశం కనుక తెర పైకి వచ్చినట్లయితే అనేక పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది అని అది టి డి పి పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: