
అలాగే విద్యా బాలన్ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కొంది. అనేక ఒడిదుడుకల అనంతరం 2005లో `పరిణీత` సినిమా ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో విద్యా బాలన్ కు సాలిడ్ బ్రేక్‌థ్రూ వచ్చింది. ఆ తర్వాత సంజయ్‌దత్ సరసన ఆమె నటించిన `లగే రహో మున్నాభాయ్` కూడా బ్లాక్ బస్టర్ కావడంతో.. విద్యా బాలన్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ దెబ్బతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్ లో ఫుల్ బిజీ యాక్ట్రస్‌గా మారింది. పుల సౌత్ చిత్రాల్లో నటించింది. పెళ్లై పిల్లలు పుట్టిన ఇప్పటికీ ఆమె నటిగా నటిస్తోంది.
ఇకపోతే విద్యా బాలన్ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో `ది డర్టీ పిక్చర్` ఒకటి. 80వ దశకంలో తెలుగు, తమిళ చిత్రాల్లో గ్లామర్ క్వీన్‌గా ప్రసిద్ధి చెందిన సిల్క్ స్మిత బయోపిక్ ఇది. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్‌లో పెను సంచలనం రేపింది. విద్యా బాలన్ కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది. సిల్క్ పాత్రలో గ్లామర్, కామెడి, ఎమోషన్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ సమర్థవంతమైన నటనను విద్యా బాలన్ ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
అయితే డర్టీ పిక్చర్ సినిమాలో చైన్ స్మోకర్‌గా ఉండాల్సి రావడంతో విద్యా బాలన్ అప్పట్లో దాదాపు 12 కిలోల బరువు పెరిగిందట. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. షూటింగ్ సమయంలో సిల్క్ పాత్ర కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగిందట. ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది. డర్జీ పిక్చర్ తర్వాత కూడా స్మోకింగ్ అలవాటును విద్యా బాలన్ చాలా రోజులు మానుకోలేకపోయింది. కాకపోతే అన్ని ఎక్కువ సిగరెట్లు కాదు.. రోజుకు 3 సిగరెట్లు తాగేదట. ఒకవేళ పొగతాగడం హానికరం కాకపోతే తాను చైన్ స్మోకర్‌గా ఉండేదాన్ని అని విద్యా బాలన్ పేర్కొనడం గమనార్హం.