కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా వేర్వేరు కారణాల వల్ల కర్ణాటక రాష్ట్రంలో విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే. హైకోర్టు చెప్పినా క్షమాపణలు కోరే దిశగా కమల్ అడుగులు వేయకపోవడంతో ఈ సినిమా నిర్మాతలకు దాదాపుగా 9 కోట్ల రూపాయల నష్టమని తెలుస్తోంది. అయితే ఉరుము ఉరిమి మంగళం మీద పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
కర్ణాటకలో కమల్ సినిమాను బ్యాన్ చేయగా తమిళనాడులో విజయ్ సినిమాను బ్యాన్ చేయాలనే చర్చ తెరపైకి వచ్చింది. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న జయ నాయకన్ మూవీ 2026 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కర్ణాటకకు చెందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా నిర్మాతలు కన్నడ వాళ్లు కావడంతో తమిళనాడులో ఈ సినిమాను చూసి నేర్చుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే ఈ తరహా ప్రకటనలు, కామెంట్లు చేసేవాళ్లపై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. థగ్ లైఫ్ సినిమాకు జయనాయకన్ సినిమాకు పొంతన ఏంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలు కన్నడ వ్యక్తులు అయినంత మాత్రాన సినిమాను బ్యాన్ చేయాలా అంటూ సరికొత్త చర్చకు తెర లేపుతున్నారు. ఈ వివాదంలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
 
జయనాయకన్ సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. విజయ్ పాలిటిక్స్ లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ హీరోకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే చర్చ సైతం మొదలైంది. ఈ వివాదం విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. కమల్ హాసన్ క్షమాపణలు చెబితే సరిపోయేదని ఆయన చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కమల్ భవిష్యత్తు సినిమాలకు సైతం కర్ణాటకలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: