
కమల్ హాసన్ పరిస్థితులకు తగ్గట్టు డిఫెరెంట్ వేరియేషన్స్ లో చెలరేగిపోయారు. సినిమాకు ఆయన నటన ప్రధాన బలంగా నిలిచింది చాలా మంది చెబుతున్నారు. కానీ, కథ, కథనం రొటీన్ గా ఉన్నాయని.. మణిరత్నం మ్యాజిక్ మిస్ అయిందని.. శింబు తన పాత్రకు ఏమాత్రం సెట్ కాలేదని అంటున్నారు. కథలో అత్యంత కీలకమైన అమర్ పాత్రను శింబు పోషించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అమర్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ శింబు కాదు.
మొదల మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేశారు. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి డేట్స్ సర్దుబాటు చేయలేక దుల్కర్ థగ్ లైఫ్ మూవీ నుండి తప్పుకున్నాడు. దాంతో దుల్కర్ ప్లేస్ ను శింబు రీప్లేస్ చేశాడు. ఇక నేడు థగ్ లైఫ్ విడుదల అయ్యాక దుల్కర్ సల్మాన్ సినిమా నుండి తప్పుకోవడమే మంచిదైందని అభిమానులు, సినీ ప్రియులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు