- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పుడు మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఇప్పటివరకు ఈ సినిమాలో చిరంజీవి ఒక పాత్రలో మాత్ర‌మే కనిపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు చిరు రెండు పాత్రలలో కనిపిస్తారని ... ఒక పాత్ర వింటేజ్‌ చిరంజీవిని గుర్తుకు తెస్తుంది ... మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్‌ లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి .. నయనతార పై ఫ్యామిలీ సీన్లు షూట్ చేస్తున్నారట. ఈ సీన్లో మెగాస్టార్ - నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుంది అని ఈ ఎపిసోడ్ సినిమాలో చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది.


ఇక ఈ సినిమా కంప్లీట్ కామెడీగా తెర‌కెక్కుతోంది. సినిమా కథ‌ చిరంజీవికి పిచ్చపిచ్చగా నచ్చేసింది అంట .. ఇక సినిమాలో రెండు పాత్రల విషయానికి వస్తే ఒకటి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ రోల్ లో ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంద‌ట‌. ఇక రెండోది యాక్షన్ మోడ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను సాహు గార‌పాటి ,  చిరంజీవి కుమార్తె కొణిదెల‌ సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకుగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: