టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడినట్టు కనిపిస్తుంది .. అయితే తాజాగా ఆమెపై పోలీస్ కేసు నమోదు చేశారు .. గచ్చిబౌలి పోలీసులు గత నెల 29 ప్రిజం పబ్ లో  బిల్ పే చేయకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని .. అలాగే తమ సిబ్బందిని బూతులు తిట్టడంతో పాటు బాడీ షేవింగ్ కూడా చేసిందని .. ప్లేట్స్ జరిగిందంటూ పబ్ యజమానియం పోలీసులకు కంప్లైంట్ చేయడంతో .. ఇక పోలీసులు ఆమెపై  324(4), 352, 351(2) BNS యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు .. ప్రధానంగా ఆ సమయంలో బర్తడే కేక్ విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరగక సిబ్బందిని కల్పిక పచ్చి బూతులు తిట్టిందని పబ్ నిర్వాహకులు ఆరోపించారు  .  


ఇదే క్రమంలో గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ఫ్రీజం పబ్ లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని .. ఆ సమయంలో బర్తడే కేక్ విషయంలో అక్కడ ఉన్న ఇరువురి మధ్య వాగ్వాదం రాగా పబ్‌ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక ఆరోపణలు చేస్తుంది .. అలాగే అందుకు సంబంచిన పలు వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని .  వెంటనే వారు తనకు క్షమాపణ చెప్పాలంటూ పబ్‌ బయట ధర్నాకు దిగింది .. అయితే ఆ సమయంలో కల్పికపై పోలీస్ కేసు నమోదు చేశారు .. ఇక గత నెల 29న కల్పిక గణేష్ పుట్టినరోజు కావటంతో తన స్నేహితులకి ఫ్రీజం పబ్‌లో బర్త్డే పార్టీ ఇచ్చింది ..


ఆ సమ‌యంలో బర్త్ డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులకు కల్పికకు గొడవ జరిగింది .  ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఇప్పుడు ఇదే విషయం పై పబ్‌ నిర్వాహకులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో గచ్చిబౌలి పిఎస్ లో కల్పికపై కేసు నమోదు చేశారు. కల్పిక చిత్ర పరిశ్రమ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో నటి మంచి పేరు తెచ్చుకున్నారు .  అలాగే ప‌లు వెబ్ సిరీస్ లోను ఈమె నటించింది .  అయితే గత కొన్నాళ్ల క్రితం వరుస వివాదాల్లో ఇరుక్కున్న కల్పిక .. ఇప్పుడు మళ్ళీ పబ్ గొడవతో వార్తలు హాట్ టాపిక్ గా నిలిచింది .

మరింత సమాచారం తెలుసుకోండి: