
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద రామ్ చరణ్ తో సినిమాను నిర్మించాలనేది ఎప్పటినుంచో వార్తల్లో ఉంటూ వస్తుంది .. అయితే ఇది ఇప్పటికి కార్యరూపం దాల్చుతుంది .. బాబాయ్ నిర్మించే అబ్బాయి సినిమా .. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో అంటే అంచనాలు మామూలుగా ఉండవు .. హారిక హాసిని బ్యానర్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తుంది .. ముందుగా వెంకటేష్ తో ఒక సినిమా , రామ్ చరణ్ తో మరొకటి .. ఎన్టీఆర్ తో మరో సినిమా ప్లాన్ చేసింది .. ఇక వీటిలో వెంకటేష్ ది ఫ్యామిలీ సినిమా కాగా .. రామ్ చరణ్ తో మాస్ యాక్షన్ మూవీ .. ఎన్టీఆర్ తో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలను ప్లాన్ చేసింది . అయితే ఇప్పుడు వీటిలో బాబాయ్ అబ్బాయి కాంబోలో వచ్చే సినిమా పై మాత్రం త్వరలోనే ఓ స్పష్టమైన క్లారిటీ రానుందని అంటున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు