సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా నిన్నటి రోజున భారీ స్థాయిలో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీలో గంజాయి, డ్రగ్స్ విదేశీ మద్యం వంటివి ఉపయోగించారని పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ.. సింగర్ మంగ్లీ మాత్రం తన పార్టీలో అలాంటివి ఏమీ లేవని తెలియజేసింది. దీంతో మంగ్లీ తో పాటుగా కొంతమంది పైన పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. పార్టీకి కేవలం ఎలాంటి అనుమతులు లేకుండా చేసుకోవడం తప్పే అంటూ మంగ్లీ తెలియజేసింది. ఈ వేడుకలలో సుమారుగా 50 మంది పాల్గొన్నట్లు సమాచారం.



సింగర్ మంగ్లీ కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన వారు , స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఇందులో జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి కూడా ఉన్నారనే విధంగా పేర్లు వినిపించడంతో ఈ విషయంపై రచ్చ రవి సెల్ఫీ వీడియో ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సింగర్ మంగ్లీ బర్తడే పార్టీలో తను అసలు పాల్గొనలేదని అలా వస్తున్న వార్తలన్నీ కూడా రూమర్స్ అని తెలియజేశారు. అసలు ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు రచ్చ రవి. గత కొద్దిరోజులుగా తన షూటింగ్ షెడ్యూల్ వల్ల బిజీగా ఉన్నానని సొంత కుటుంబాన్ని కూడా చూసుకోవడానికి సమయం దొరకలేదని అలాంటిది తాను పార్టీకి వెళ్లినట్లు కొంతమంది ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి అంటూ తెలిపారు. ఇలాంటి విషయంపై రూమర్స్ రావడంతో రచ్చ రవి కెరియర్ కి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో చూడాలి.

సింగర్ మంగ్లీ బర్తడే పార్టీలో విదేశీ మద్యం దొరికిందని గంజాయి దొరికిందనే విధంగా వార్తలు వినిపించాయి.. మరొకవైపు తన పార్టీలో ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని కేవలం సౌండ్ విష్ యు వల్లే పోలీసులు రైడ్ చేశారంటూ మంగ్లీ కూడా తెలిపింది. అనుమతులు తీసుకోకుండా పార్టీ చేశారని పోలీసులు కూడా ప్రశ్నించారని దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను కూడా అధికారులు సేకరించారని తెలియజేసింది. మొత్తానికి అనధికారికంగా పార్టీతో సింగర్ మంగ్లీ చిక్కుల్లో చిక్కుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: