మెగా డాటర్ నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.ఈమధ్య సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే నిహారిక షేర్ చేసిన ఫోటోని చూసిన చాలామంది నెటిజన్స్ నిహారిక రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ నిహారిక షేర్ చేసిన ఫోటో ఏంటి అనేది చూస్తే.. తాజాగా నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో ఫేస్ కనిపించకుండా ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో పట్టుచీర, ఒళ్ళో మల్లెపూలు, చేతినిండా గాజులు, చేతికి గోరింటాకుతో కనిపించింది.

అయితే ఈ చూస్తే మెగా ఫ్యామిలీలో ఏదో శుభకాయం జరిగినట్లే కనిపిస్తోంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ నిహారిక రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొంత మందేమో నిహారిక ఎంగేజ్మెంట్ కాదు లావణ్య త్రిపాటి శ్రీమంతం చేశారు కావచ్చు. ప్రస్తుతం లావణ్య త్రిపాటికి 5 మంత్స్ కావచ్చు. అందుకే ఇంట్లో సింపుల్ గా శ్రీమంతం చేశారని కొంతమంది అంటుంటే, మరి కొంత మందేమో 9 మంత్స్ కావచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.మరి నిహారిక షేర్ చేసిన పోస్ట్ లో ఉన్నది ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోనా..లేక తన వదిన శ్రీమంతం ఫోటోనా అనేది తెలియాల్సి ఉంది.

ఇక జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకున్న నిహారిక విడాకులు తీసుకొని సినిమాల్లో రాణిస్తోంది. అలా రీసెంట్గా నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రాళ్ళు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే తమిళంలో నటించిన మద్రాస్ కారన్ మూవీలో నిహారిక చాలా బోల్డ్ గా నటించింది. ఈ సినిమాలో నిహారిక ని చూసి మెగా ఫ్యామిలీ పై ట్రోలింగ్ కూడా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం నిహారిక మంచు మనోజ్ తో వాట్ ది ఫిష్ అనే మూవీలో చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: