టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోలలో నాగార్జున ఒకరు. ఇప్పటివరకు హీరో పాత్రలలో ఎక్కువగా నటించిన నాగ్ ప్రస్తుతం తన ఇమేజ్ కు భిన్నంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో గెస్ట్ రోల్స్ లో నటించడానికి ఇష్టపడుతున్నారు. కాలానికి అనుగుణంగా మారే విషయంలో నాగ్ ముందువరసలో ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కలెక్షన్లు అంతకంతకూ తగ్గుతున్నాయి.

ఒక విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో మాత్రమే  థియేటర్లు ఫుల్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది హిట్టైన సినిమాల సంఖ్యను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చూ. ఇండస్ట్రీ పతనం గురించి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేయగా  ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  ఓటీటీల హవా  పెరగడం కూడా ఇందుకు ఒక విధంగా  కారణం అని చెప్పవచ్చు.

ఈ పరిస్థితి గురించి నాగ్ మాట్లాడుతూ  ఇండస్ట్రీలో ఇలాంటివి సహజం అని అన్నారు.  నా కెరీర్ లో టాలీవుడ్ పతనం కావడం మూడుసార్లు చూశానని ఆయన  చెప్పుకొచ్చారు.  ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించకుండా  నెలల తరబడి థియేటర్లు ఖాళీగా ఉన్న పరిస్థితి ఏర్పడిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.  అయితే అలా పడిన ప్రతిసారి టాలీవుడ్  తిరిగి లేచిందని  నాగ్  కామెంట్లు  చేశారు.

ప్రస్తుతం  పరిశ్రమ స్లంప్ లో ఉందని త్వరలో ఇండస్ట్రీకి స్వర్ణయుగం వస్తుందని ఆయన పేర్కొన్నారు.  ఇండస్ట్రీ ట్రెండ్ కూడా మారుతోందని  తెలుగులో కోర్ట్  సినిమా  హిట్టవ్వడం  ఇందుకు ప్రూఫ్ అని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  నాగ్ పారితోషికం సైతం  భారీ స్థాయిలో  ఉండగా   కుబేర, కూలీ సినిమాలతో నాగ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది.  నాగార్జున  రేంజ్  మరింత పెరిగితే  ఫ్యాన్స్ సైతం ఎంతో  సంతోషిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: