
ఫోర్బ్స్ ప్రకారం.. సంజయ్ కపూర్ సుమారు $1.2 బిలియన్(ఇండియన్ కరెన్సీలో రూ. 10,300 కోట్లు) నికర ఆస్తులను కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే 2703వ అత్యంత సంపన్న వ్యక్తి ఆయన. అలాగే ఆరు నెలల క్రితం ఆయన సోనా కామ్‌స్టార్ కంపెనీ మార్కెట్ వాల్యూ సుమారు రూ. 40 వేల కోట్లు. సంజయ్ కపూర్ ఇండియాలో ప్రీమియం ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగే లండన్, ఢిల్లీ, ముంబైతో సహా అనేక టెక్ మరియు తయారీ స్టార్టప్‌లలో కూడా పెట్టుబడి పెట్టారు.
పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కరిష్మా కపూర్ భర్తగా సంజయ్ కపూర్ బాగా పాపులర్ అయ్యారు. అయితే సంజయ్‌కు కరిష్మా ఫస్ట్ వైఫ్ కాదు. మొదట ఆయన ఫ్యాషన్ డిజైనర్ నందితా మాహతాని 1996లో వివాహం చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో వీరి విడాకులు తీసుకున్నారు. 2003లో కరిష్మా కపూర్ తో సంజయ్ ఏడడుగులు వేయగా.. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. 2016లో వ్యక్తిగత విభేదాలతో కరిష్మాకు కూడా విడాకులిచ్చిన సంజయ్.. 2017లో ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ జంటకు ఒక కుమారుడు పుట్టాక మరో కుమార్తెను దత్తత తీసుకున్నారు. ఇక సంజయ్ కపూర్‌తో విడాకులు తీసుకోవడం వల్ల అతని పేరిట ఉన్న వేల కోట్ల ఆస్తులను కరిష్మా కపూర్ కోల్పోయింది. అయితే మాజీ భర్త ఆస్తిలో ఆమె ఇద్దరు పిల్లలకు కొంత వాటా రానుందని అంటున్నారు.