అవునా..ఇది నిజమా.. అనిరుధ్ రవి చంద్రన్ పెళ్లి చేసుకోబోతున్నారా అనుకుంటారు ఈ వార్త తెలిసిన చాలా మంది అనిరుధ్ అభిమానులు.మరి ఇంతకీ అనురుధ్  పెళ్లి చేసుకోబోతున్న ఆ కత్తిలాంటి ఫిగర్ ఎవరయ్యా అంటే ఐపీఎల్ లో ఎస్ ఆర్ ఎస్ టీమ్ ఓనర్ గా ఉన్న కావ్య మారన్.. దాదాపు 3000 కోట్లకు అధిపతిరాలైనటు వంటి కావ్య మారన్ ఇండియన్ సినీ హిస్టరీలో మ్యూజిక్ డైరెక్టర్ గా యంగ్ ఏజ్ లోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అనిరుధ్ రవిచంద్రన్  ని పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్ ప్రస్తుతం కోలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. 

అంతేకాదు అనిరుధ్ రవి చంద్రన్ కావ్య మారన్ ల ప్రేమ ఇప్పటిది కాదని, దాదాపు పది సంవత్సరాలు అవుతుందని, వీరిద్దరి మధ్య పరిచయం 2014లోనే జరిగిందని, కానీ ఈ విషయాన్ని ఎవరు కూడా గమనించలేదని, వీరిద్దరి మధ్య అప్పటినుండే పరిచయం పెరిగి డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు 2025 లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అనురుధ్ రవిచంద్రన్ కావ్య మారన్ ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పాటు పి పి డుం డుం అంటూ నెట్టింట్లో కావ్య మారన్ అనురుధ్ రవిచంద్రన్ ల ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

మరి కావ్య మారన్ అనిరుధ్ రవిచంద్రన్పెళ్లి వార్తలు నిజమేనా.. వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అనేది తెలియాలంటే కచ్చితంగా ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే. అయితే గత కొద్ది రోజుల నుండి అనిరుధ్ రవిచంద్రన్ కావ్య మారన్ ల ప్రేమ వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ వీరిద్దరిలో ఏ ఒక్కరు కూడా ఈ వార్తను ఖండించకపోవడంతో మౌనం అర్ధాంగీకారం కాబట్టి వీరిద్దరి మధ్య ప్రేమ నిజమే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: