"సౌందర్య"..ఇది ఒక పేరే కాదు ఒక బ్రాండ్ కూడా. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు. అయినా సరే ఈ హీరోయిన్ స్థానం మాత్రం ఎప్పటికీ టాప్ పొజిషన్లోనే ఉంటుంది . ఆమె మన మధ్య లేకపోయినా సరే ఆమె నటనను ఆరాధించి ఇష్టపడే జనాలు ఆమెను ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటారు . ఈ సినిమాలో సౌందర్య నటించి ఉంటే బాగుండేది . సౌందర్య ఈ స్థానంలో ఉంటే ఇంకా ఎంత బాగుండేదో ..?? అంటూ ప్రతి విషయంలోనూ సౌందర్య తో కంపారిజన్ చేస్తూనే ఉంటారు.  అంతలా సౌందర్య ని ఓ హీరోయిన్లా కాకుండా కూతుర్ల అందరి ఫ్యామిలీతో కనెక్ట్ అయిపోయింది .

దురదృష్టవశాతూ సౌందర్య ఆది చిన్న వయసులోనే మరణించింది . సౌందర్య ఇండస్ట్రీ లోకి వచ్చినది తక్కువ టైంలోనే ఏ హీరోయిన్ అందుకోనంత స్టార్ స్టేటస్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఆమెపై రూమర్స్ కూడా అలాగే వినిపిస్తూ వచ్చాయి.  ఎక్కువగా ఆమె హీరో వెంకటేష్ హీరో జగపతిబాబు లతో సినిమాలు చేసింది.  ఈ క్రమంలోనే ఆమెకు వాళ్లకు మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ ఎఫైర్స్ కూడా అంటగట్టేశారు కొంతమంది ఆకతాయిలు.  మరీ ముఖ్యంగా సౌందర్య గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో వినిపించే బిగ్ రూమర్ "జగపతిబాబు - సౌందర్య" లు ప్రేమించుకున్నారని ..పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని.. కుటుంబ సభ్యులు నో చెప్పడంతోనే అది క్యాన్సిల్ అయింది అని .. ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది .

అయితే అది నిజం కాదు అంటూ పలు సందర్భాలలో ఎప్పటికప్పుడు జగపతిబాబు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు . సౌందర్య తన కెరియర్ లో ఎంతో మంది హీరోలతో వర్క్ చేసిన జగపతిబాబు అంటే ఎక్కువగా అభిమానంగా ఉండేదట . వీళ్ళ కాంబినేషన్ కూడా అలానే ఉండింది. వీళ్ళ కాంబోలో సుమారు 10 సినిమాలు వచ్చాయి . . అన్ని హిట్టే కెమిస్ట్రీ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది . ఈ కెమిస్ట్రీని చూసి పొరపాటు పడ్డ జనాలు వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ మాట్లాడుకున్నారు . కానీ అలాంటిదేమీ లేదు అని సౌందర్యకి అప్పటికే వాళ్ల బావ అంటే ఇష్టమని అదే విధంగా జగపతిబాబుకి అప్పటికే పెళ్లయిపోయింది అని చాలామంది సినీ పెద్దలు కూడా క్లారిటీ ఇచ్చారు.  అయినా సరే వీళ్ళకి సంబంధించిన ఆ రూమర్ మాత్రం ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.  మొదటగా హీరోగా నటించిన జగపతిబాబు ఆ తర్వాత బిగ్ స్టార్స్ కి కూడా తండ్రిగా నటించాడు.  శ్రీమంతుడు సినిమాలో జగపతిబాబు..హీరో మహేష్ బాబుకి తండ్రిగా కనిపించాడు . ఈ సినిమా మంచి హిట్ అందుకుంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: