అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్ అక్కినేని ఇటీవల ఓ ఇంటివాడు అయ్యాడు. చిత్రకారిణి జైనాబ్ ను అఖిల్ వివాహం చేసుకున్నాడు. నాగార్జున నివాసంలో వీరి వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సంగతి పక్కన పెడితే.. అఖిల్ గతంలో శ్రియా భూపాల్ అనే అమ్మాయితో పెళ్లి వరకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. వయసులో తనకంటే నాలుగేళ్లు పెద్దదైన శ్రియా భూపాల్ తో ప్రేమలో పడ్డ అఖిల్.. 2016లో పెద్దల‌ను ఒప్పించి ఆమెతో గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నాడు. అప్పటికి అఖిల్ వయసు కేవలం 22 సంవత్సరాలు.


ఇరు కుటుంబాలు వీరి పెళ్లిని ఇటలీలో గ్రాండ్ గా చేయాలని భావించాను. కానీ 2017లో అనూహ్యంగా అఖిల్ తో శ్రియా భూపాల్ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగుపెట్టబోయి జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు అఖిల్ జైనాబ్ ను వివాహం చేసుకోవడంతో మరోసారి శ్రియా భూపాల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎక్కడుంది..? ఏం చేస్తుంది..? అన్న విషయాల‌ను నెటిజ‌న్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.


ప్రముఖ వ్యాపారవేత్త, హైద‌రాబాద్ లోనే అత్యంత సంప‌న్నుడు జివికె మనవరాలే శ్రియా భూపాల్. అఖిల్ తో బ్రేక‌ప్ జ‌రిగిన‌ కొద్దిరోజుల్లోనే శ్రియా భూపాల్ ప్రసిద్ధ భారత కార్‌ రేసింగ్ ఛాంపియన్‌ మరియు ఎంట్రప్రెన్యూర్ అయిన కొండా అనిందిత్ రెడ్డితో పెళ్లి పీట‌లెక్కింది. ఈ జంట 2018లో పారిస్‌లో రాయ‌ల్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ వేడుక‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు కూడా సంద‌డి చేశారు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌నల‌తో శ్రియా భూపాల్ కు లింకేంటి అనే డౌట్ రావొచ్చు.
శ్రియాను పెళ్లాడిన అనిందిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీత దంపతుల కుమారుడు. సంగీత మ‌రియు ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెళ్లు. అంటే ఉపాసన, ఆనిందిత్ బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు. అనిందిత్ తో వివాహం జ‌ర‌గ‌డంతో శ్రియాకు రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు బంధుత్వం ఏర్ప‌డింది. అన్న‌ట్లు అనిందిత్, శ్రియా దంప‌తుల‌కు ఒక కుమారుడు కూడా జ‌న్మించాడు.


ఇక‌పోతే న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కంప్లీన్‌ చేసిన శ్రియా భూపాల్‌.. ఫ్యాషన్ డిజైన‌ర్‌గా త‌న‌కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `శ్రియా సమ్` పేరుతో ఓ దుస్తుల బ్రాండ్ ను న‌డుపుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంద‌రో సినీ తారలకు శ్రియా భూప‌ల్‌ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: