
ప్రజెంట్ ఘట్టమనేని ఫ్యాన్స్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న పని పట్ల కోపంగా ఉన్నారు. మనకు తెలిసిందే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన కెరియర్లో ఎప్పుడో లేనంత విధంగా హైప్స్ నెలకొన్నాయి . మరీ ముఖ్యంగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అన్న వార్త కూడా సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఇది ఇలా ఉండగా రీసెంట్గా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మహేష్ చేస్తున్న రోల్ పట్ల రాజమౌళి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట .
మహేష్ రోల్ ని మాత్రం చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారట. ఫస్ట్ హాఫ్ లో మొత్తం నెగిటివ్గా ఉంటుందట మహేష్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో పూర్తి పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుందట . ఈ సినిమాల్లో మొత్తానికి మహేష్ పాత్ర మెయిన్ హైలెట్ గా నడుస్తుంది అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ మహేష్ బాబు అభిమానులకి ఇది హ్యాపీగానే ఉన్న కానీ ఇప్పటివరకు మహేష్ బాబుని నెగిటివ్ యాంగిల్ లో ఎప్పుడు చూడలేదు. మరి ఈ సినిమాలో నెగిటివ్ యాంగిల్ లో చూసి మహేష్ బాబు అభిమానులు తట్టుకుంటారా..? అనేది ఒక క్వశ్చన్ మార్క్ .
అంతే కాదు సాఫ్ట్ హీరో పాత్ర చేస్తే ఎంతవరకు జనాలకి ఎక్కుతుంది అనేది కూడా బిగ్ డౌట్ . రాజమౌళి బ్రెయిన్ లో చిప్ దొబ్బిన్నట్లుంది. ఆ కారణంగానే సాఫ్ట్ హీరో చేత నెగిటివ్ షేడ్స్ చేయిస్తున్నాడు అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం రాజమౌళి ఏం చేసినా సరే పర్ఫెక్ట్ టైమింగ్ ప్లానింగ్ లో ఉంటుంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!