
కాలేజ్ డేస్‌లో ఓ రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మాళవిక ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా జరిగిన ఘటన ఇది. వీళ్లు ఉన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ మొత్తం ఖాళీ.. సరిగ్గా అప్పుడే ఒక పోకిరి కిటికీ గ్రిల్‌కు దగ్గరగా వచ్చి ఏక్ చుమ్మా దేగి క్యా(ఒక ముద్దు ఇస్తావా)? అంటూ చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. చుట్టూ జనాలు ఎవరూ లేకపోవడం, ఆ వ్యక్తి తీరు తేడాగా ఉండటంతో మాళవిక మరియు ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ భయంతో వణికిపోయారట. ఆ టైమ్ లో ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోయామని, సుమారు 10 నిమిషాలకు నెక్స్ట్ స్టేషన్ లో ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కడంతో.. తాము ఊపిరి పీల్చుకున్నామని మాళవిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే మాళవిక మోహనన్ పంచుకున్న ఈ సంఘటనపై ముంబై పోలీసులు స్పందించడం విశేషం.
`మిస్ మాళవిక.. ఒక వార్తాపత్రిక యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌లో మీ కథనాన్ని మేము చూశాము, మీరు మీ అనుభవాన్ని పంచుకున్నారు మరియు నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మేము భావిస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా, దయచేసి 112/100 నంబర్ కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. వీలైనంత త్వరగా మేము సాయం అందిస్తాము. ఫిర్యాదు చేయకపోవడం అనేది నేరస్థుడికి ధైర్యం ఇస్తుంది. ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. దానిని మెరుగుపరచడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. ఫిర్యాదు చేసిన తర్వాత, నేరస్థుడిని తగిన విధంగా, చట్టబద్ధంగా బుద్ధి చెబుతాము. దయచేసి అర్థం చేసుకుని ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి` అంటూ ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.