సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే . ఒక స్టార్ హీరో కోసం అనుకున్న కథలో మరొక స్టార్ హీరో వస్తూ ఉంటారు.  అయితే అది కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా కావచ్చు.  కధ  నచ్చకపోయినా కారణంగా కావచ్చు.  కథ నచ్చిన కూడా సినిమాను కొన్ని కొన్ని సిచువేషన్ లో ఓకే చేయలేం.  అలాంటి సిచువేషన్ బాలయ్య తన లైఫ్ లో ఎన్నో ఫేస్ చేశాడు. మరి ముఖ్యంగా బాలయ్యకి ఒక కథ విపరీతంగా నచ్చేసింది . ఆ కథ బాలయ్య చేసుంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసుండేవాడు . కానీ ఆయన అప్పటికే వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న కారణంగా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా విక్టరీ వెంకటేష్ ఖాతాలో పడింది . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా వెంకటేష్ కెరియర్ ని టర్న్ చేసి ఇండస్ట్రీలో వెంకటేష్ కి స్పెషల్ స్థానాన్ని అందించింది . అంతేనా దగ్గుబాటి ఫ్యామిలీ తలెత్తుకునేలా చేసింది . ఆ సినిమా ఏంటి ..? అసలు బాలయ్య ఖాతాలో  నుంచి వెంకటేష్ ఖాతాలోకి ఆ మూవీ ఎలా వచ్చి చేరింది..? అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్న ఎన్  శంకర్ డైరెక్షన్ కి మాత్రం వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . మరి ముఖ్యంగా శ్రీ రాములయ్య , యమజాతకుడు , ఆయుధం లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలు రూపొందించిన శంకర్ విక్టరీ వెంకటేష్ తో "జయం మనదేరా" అనే సినిమాను తెరకెక్కించారు . నిజానికి ఈ సినిమాలో ముందుగా హీరోగా బాలకృష్ణ ని అనుకున్నారట . తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి బాలయ్యతో పరిచయం ఉందట . ఆ టైంలోనే ఏదైనా కథ ఉంటే చెప్పు చేద్దామంటూ బాలయ్య అడగడంతో ఆయన రాసుకున్న "జయం మనదేరా" సినిమా స్టోరీ ని వివరించారట . అయితే బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో .. ఈ సినిమా కార్యరూపం దాచలేదు.  ఆ తర్వాత ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్నాడట .



ఇదే విషయాన్ని రామోజీరావుకి చెప్పారట .  కధ విన్నాక  కథ సూపర్ గా ఉంది అని చెప్పి హీరో ఎవరిని అనుకుంటున్నావు అని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పారట . పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి కధ  వినిపిస్తే నచ్చిందట . కానీ వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాని రిజెక్ట్ చేశారట . ఇక అదే టైంలో పక్కనే సురేష్ బాబు ఉండడం వెంకటేష్ కోసం ఏదైనా కథ ఉంటే చెప్పమని అడగడం .. అదే స్టోరీని కొంచెం గా మార్చి  వెంకటేష్ కటౌట్ కి తగ్గట్టు క్యారెక్టర్ని మార్చేసి స్టోరీ చెప్పాడట. నిజానికి జయం మనదేరా స్టోరీ రాసుకున్నప్పుడు శంకర్ మొదటగా ఫారిన్ లో ఉండే పోలీస్ ఆఫీసర్గా బాలయ్యను చూపించాలనుకున్నారట. కానీ వెంకటేష్ కి అలాంటి క్యారెక్టర్ సూట్ అవ్వదు అని తెలిసి పోలీస్ ఆఫీసర్ కాకుండా టూరిస్ట్ గైడ్ గా మార్చేసారట . 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారింది.  మరీ ముఖ్యంగా అప్పటివరకు వెంకటేష్ కి ఒక సెట్ అఫ్  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది . కానీ జయం మనదేరా సినిమా తర్వాత మాత్రం అటు క్లాస్ ఇటు మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరి సపోర్ట్ పెరిగింది.  దగ్గుబాటి ఫ్యామిలీ తలెత్తుకునేలా చేసింది ఈ సినిమా అంటూ అప్పట్లో జనాలు రక రకాలుగా పొగిడేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: