టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 3.98 మిలియన్ వ్యూస్ ... 205.3 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో అద్భుతమైన రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన అనేక మంది నటీ నటులు నటించారు. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ , మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

అలాగే మోహన్ బాబు కూడా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇలా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన ఎంతో మంది నటీ నటులు ఈ సినిమాలో నటించడంతో కూడా ఈ మూవీ పై అంచనాలు ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: