డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఎంత సింపుల్ గా ఎలాంటి హింస లేకుండా ఉంటాయో చెప్పనక్కర్లేదు.ఈయన తీసిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఆనంద్, ఫిదా, గోదావరి, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,హ్యాపీ డేస్ వంటి ఎన్నో ప్రేమకథ సినిమాలు వచ్చాయి. అయితే అలాంటి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, రష్మిక మందన్నా కాంబోలో కుబేర మూవీ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే ఈ సినిమా మరో ఐదు రోజుల్లో అంటే జూన్ 20 న విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

ఇక ఈయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ హీరోయిన్ తో సినిమా చేసి వేస్ట్ గా చేశాను అని ఫీలైయిన సందర్భం ఒకటి ఉంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార.. లేడి సూపర్ స్టార్ నయనతారతో నేను అనామిక అనే సినిమా చేశాను. అయితే అప్పటికీ  నా దగ్గర ఏ సినిమా కథలు లేవు.అందుకే అనామిక సినిమా చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలో నయనతార లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తే సినిమా మరింత హిట్ అవుతుంది అనుకున్నాను.కానీ సినిమా రిజల్ట్ అస్సలు బాలేదు.

అయితే నా దగ్గర కథ లేకపోవడం వల్లే రిమేక్ సినిమా చేశాను.కానీ డిజాస్టర్ అయింది.అయితే ఈ సినిమా చేయడానికి మరో కారణం ఉంది. దేశంలో అప్పుడు నిర్భయ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి తరుణంలో లేడీ ఓరియంటెడ్ మూవీ అయినటువంటి అనామిక చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది అని భావించాను.. కానీ సినిమా వర్కౌట్ అవ్వలేదు.దాంతో నయనతారతో అనామిక సినిమా అనవసరంగా చేశాను అని ఆ తర్వాత ఫీలయ్యాను అంటూ శేఖర్ కమ్ముల తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: