ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కన్నా పాత సినిమాలు రీ రిలీజ్ అవ్వడమే ఎక్కువగా చూస్తున్నాం.  ఏ స్టార్ హీరో పుట్టినరోజు అయిన ఆ స్టార్ హీరోకి స్పెషల్ రోజైనా డైరెక్టర్ కి స్పెషల్ రోజైన ఇలా తమ పాత సినిమాలను మరొకసారి రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు సినీ  స్టార్స్ . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో  నటించాడు కానీ అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ సినిమాగా తొలిప్రేమ నిలిచింది.


సినిమా లో పవన్..కొంచెం నాటిగా ..కొంచెం బాధ్యతగా.. కొంచెం రొమాంటిక్గా..ఫుల్ సెంటిమెంటల్ ఫేలోగా  చాలా చకగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు.  నేటితరం యూత్ కి ఈ సినిమా కేవలం రెండుసార్లు రిలీజ్ అయినట్టు మాత్రమే తెలుసు . కానీ మొత్తంగా ఈ సినిమా ఎనిమిది సార్లు రీ రిలీజ్ అయ్యింది అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు . దిల్ రాజు ఈ చిత్రం నైజాం రైట్స్ ను అప్పట్లో కొనుగోలు చేసి కుబేరుడు అయిపోయాడు అనడంలో అతిశక్తి కాదేమో .



2023వ సంవత్సరంలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రీ రిలీజ్ చేశారు మేకర్స్ . అప్పట్లో అభిమానులు సపోర్ట్ ఇవ్వక పోయినప్పటికీ ఈ చిత్రానికి కోటి 50 లక్షలు దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయి . ఇక 2023వ సంవత్సరం వరకు ఏడుసార్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఏడు సార్లు కలిపి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టిందట . అంతేకాదు రీ రిలీజ్ హిస్టరీలోనే ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు అని చెప్పొచ్చు . ఇక ఎనిమిదవ సారి రీసెంట్ గానే విడుదల చేశారు మేకర్స్ . సమయం సందర్భం ఏమీ లేకపోయినా కొత్త సినిమాలు విడుదలకు దగ్గర్లో లేకపోవడంతో థియేటర్స్ ఫీడింగ్స్ కోసం ఇలా విడుదల చేశారు అంటూ కామెంట్స్ వినిపించాయి . కాగా మొదటి రోజు ఇండియా వైట్ గా 70 లక్షల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది . ఇది నిజంగా మామూలు విషయం కాదని చెప్పాలి.  ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన కొన్ని సినిమాలకు కూడా ఇలాంటి గ్రాస్ రాబట్టలేదు . ఎన్నిసార్లు చూసినా సరే తొలిప్రేమ సినిమా మాత్రం అభిమానులను స్పెషల్గా ఆకట్టుకుంటూ వస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: