ప్రభాస్.. ఇది ఒక పేరే కాదు . ఒక బ్రాండ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనే ప్రభాస్ అంటే ఒక బ్రాండ్ లా మారిపోయాడు . దానికి దీం మెయిన్ రీజన్ బాహుబలి సినిమా అని చెప్పుకోక తప్పదు . ప్రభాస్ నటించినబాహుబలి సినిమా తర్వాతే ప్రభాస్ రేంజ్ క్రేజ్ ఈ విధంగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ప్రభాస్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి ప్రభాస్ ఖాతాలో ఎన్నో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి.  కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సాధించిన ఓ రికార్డ్ మాత్రం ఇప్పటివరకు ఏ సౌత్ హీరో కూడా సాధించకపోవడం గమనార్హం.


సోషల్ మీడియాలో మరొకసారి టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరుని ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు జనాలు.  ప్రభాస్ నటించిన లాస్ట్ ఏడు సినిమాలల్లో ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ అందుకున్నాయి. అంతేకాదు ప్రతి సినిమా కూడా 100 కోట్లు క్రాస్ చేసింది . మొదటగా బాహుబలి ది బిగినింగ్.. 2015లో రిలీజ్ అయింది  ఈ మూవీ. హిందీ వర్షన్ లో ఏకంగా 118 . 7 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.  ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు రానా దగ్గుబాటి - అనుష్క - తమన్నా - రమ్యకృష్ణ కూడా నటించారు .



బాహుబలి 2 : ది కంక్లూషన్ 2017 లో రిలీజ్ అయింది . ఈ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది . ఇక ఆ తర్వాత సాహో.. హిందీ వర్షన్ లో 142 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ - ప్రభాస్ ల మధ్య వచ్చే సీన్స్ మరింత హైలెట్గా నిలిచాయి . ఇక ఆ తర్వాత వచ్చిన రాదే శ్యామ్..హిందీ వర్షన్ లో కేవలం 19 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది . ఇక ఆ తర్వాత వచ్చిన ఆది పురుష్  135 కోట్లు కలెక్ట్ చేసింది . కానీ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇక సలార్ .. పార్ట్ వన్ సీజ్ ఫైర్.. 2023 లో రిలీజ్ అయ్యి 153.84 కోట్లు కలెక్ట్ చేసింది . ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృథ్విరాజ్ కుమారన్- శృతిహాసన్- జగపతిబాబు నటించారు.  ఇక లాస్ట్ గా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి  మొత్తంగా 294 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది . ఇలా గత పది ఏళ్లల్లో  ప్రభాస్ నటించిన ఏడు సినిమాలలో ఆరు సినిమాలు 100 కోట్లు క్రాస్ చేయడం నిజంగా ఒక గ్రేట్ రికార్డ్ అంటున్నారు సినీ ప్రముఖులు . బాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి రికార్డు క్రియేట్ చేయలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: