మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నారని ప్రకటన వెలువడిన సమయంలో చాలామంది ప్రభాస్ తప్పు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ది రాజాసాబ్ సినిమా టీజర్ చూసిన తర్వాత అభిమానుల్లో ఉన్న ఎన్నో సందేహాలు పటాపంచలయ్యాయి. పక్కా కమర్షియల్ చేస్తున్న సమయంలో యువి వంశీ ప్రభాస్ తో సినిమా చేస్తావా అని అడగగా ఛాన్స్ వస్తే ఎందుకు చేయనని అన్నానని మారుతి తెలిపారు.

ప్రభాస్ ను ముంబైలో చుసిన వెంటనే దేవుడిని  చూసిన భావన కలిగిందని అయన చెప్పుకొచ్చారు.  నా సినిమాలలో ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్ తనకు ఇష్టమని  ప్రభాస్ చెప్పారని ఆయన తెలిపారు.  పక్కా కమర్షియల్  సినిమా ఫ్లాప్ కావడంతో అప్పటికే కమిట్ అయినా ప్రొడ్యూసర్ వెనక్కు తగ్గాడని  మారుతి కామెంట్లు చేసారు.  ప్రభాస్ తో హర్రర్ కామెడీ మూవీ అంటే  ఇంట్లో వాళ్ళు సైతం  సందేహం వ్యక్తం చేశారని మారుతి తెలిపారు.

రాజాసాబ్ మూవీ మొదలైన సమయంలో మారుతితో సినిమా అవసరమా అని ప్రభాస్ తో ఎంతోమంది అన్నారని మారుతి కామెంట్లు చేశారు.  ప్రభాస్ మీ అభిమానం,  ప్రేమ ఆయన  గుండెల నిండా నింపేసుకున్నారని మారుతి పేర్కొన్నారు.  మీకంటే 1000  రెట్లు   ఎక్కువగా  ఆయన మిమ్మల్ని  ప్రేమిస్తున్నారని మారుతి చెప్పుకొచ్చారు.  సినిమా ఎలా ఉంటుందో  మీ ఊహకు మాత్రం అందదని  వెల్లడించారు.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా  కొంచెం వర్క్ ఉందని  క్వాలిటీ కంటెంట్  ఇవ్వడానికి మేము  ఎంతో   శ్రమిస్తున్నామని మారుతి  అన్నారు.  రాజాసాబ్ మూవీ కొత్త  రికార్డులు క్రియేట్ చేస్తుందని నిర్మాత ఎస్.కె.ఎన్  అన్నారు.  ఈ  సినిమా మొదలైన సమయంలో  ఒక నిర్మాత నెగిటివ్ క్యాంపెయిన్  చేశాడని  డిసెంబర్ నెల 5వ తేదీన  పాన్ ఇండియా షేక్  అవుతుందని  ఆయన  వెల్లడించారు.  ఈ సినిమా భారీ  సినిమా కానుందని  విశ్వప్రసాద్  వెల్లడించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: