గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటీ ఫుల్ నటి మని అయి నటు వంటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని రోజుల క్రితం ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. ఇకపోతే ఈ మూవీ లో బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా ఈయన పెద్ది సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజాగా అంబటి అర్జున్ మాట్లాడుతూ ... పెద్ది సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధిస్తుంది అని నేను అనుకుంటున్నాను. బుచ్చిబాబు ఆ సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారు. సినిమాలో డ్రామా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమా జాతీయ అవార్డును అందుకుంటుంది అని నేను నమ్ముతున్నాను అని అంబటి అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా అంబటి అర్జున్ "పెద్ది" సినిమా గురించి చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: