ఇది నిజంగా సందీప్ రెడ్డివంగకు బిగ్ షాక్ అని అంటున్నారు బాలీవుడ్ జనాలు . ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డివంగా పేరు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రెండ్ అయిందో ట్రోలింగ్ కి గురైందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా స్పీరిట్  సినిమాలో హీరోయిన్ దీపిక పదుకొనేను తీసేసి ఆయన బిగ్ మిస్టేక్ చేశారు అని కొంతమంది సినీ ప్రముఖులు కూడా కామెంట్స్ చేశారు . రెమ్యూనరేషన్ కారణంగానే సందీప్ రెడ్డివంగా ఈ విధంగా ఆమెని  సినిమాలో నుంచి తీసేయడం చాలా దారుణం అంటూ కూడా బాలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు .


అంతేనా దీపిక పదుకొనె ని ఈ సినిమా నుంచి తప్పించేసి వెంటనే హీరోయిన్ త్రిప్తి దిమ్రిని సెలెక్ట్ చేశాడు . సెకండ్ కూడా ఆలస్యం లేకుండా అఫీషియల్గా ఆ విషయాన్ని బయటపెట్టారు . అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి జరిగిన రాద్ధాంతం అందరికీ తెలిసిందే.  ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక హీరోయిన్ తప్పుకుంది అన్న వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న  స్పిరిట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ఠాకూర్ సెలెక్ట్ అయ్యింది అంటూ టాక్ వినిపించింది . చాలా చాలా ఢిఫరెంట్ గా సందీప్ ఈ క్యారెక్టర్ రాసుకున్నారు అంటూ కూడా మేకర్స్ మాట్లాడుకున్నారు.



అయితే ఏమైందో ఏమో కానీ  ఈ సినిమాలో నుంచి  ఆమె తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . సందీప్ రెడ్డివంగా ముందుగానే ఈ సినిమాలో  ఆమెకు ఎలాంటి సీన్స్ ఉంటాయో అన్ని క్లారిటీగా చెప్పారట . మొదట ఓకే అన్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సైలెంట్ గా తప్పుకునేసిందట.  ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. కొందరు బాలీవుడ్ స్టార్స్ ఆమె ని ఈ విధంగా సినిమా నుండి తప్పుకునేలా చేశారు అంటూ కూడా ఓ న్యూస్ బయటకి వచ్చింది. దీని పట్ల  ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు రెబల్ అభిమానులు . ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే తొక్కలో రీజన్స్ చెప్పి తప్పుకుంటావా..? అంటూ రెబల్ అభిమానులు కూడా మృణాల్ పై మండిపడుతున్నారు . ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నే కాక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: