గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ లో శివ రాజ్ కుమార్ , జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ చిన్న గ్లీమ్స్ వీడియోను విడుదల చేయగా అది సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ఒక్క సారిగా అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం పెద్ది మూవీ యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ లో భారీగా వేసిన రైల్వే స్టేషన్ సెట్ లో రామ్ చరణ్ పై అత్యంత భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్న యాక్షన్ ఎపిసోడ్ కోసం చరణ్ అత్యంత రిస్క్ సన్నివేశాలలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ జూన్ 19.వ తేదీ వరకు కొనసాగనన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: