
తాజా ఎపిసోడ్లో పాల్గొన్న వర్షకు పెళ్లి చేసుకుంటావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? అని అడగగా.. ఈ విషయం పైన వర్ష ఇలా మాట్లాడుతూ తాను లైఫ్ లో అసలు వివాహం చేసుకోనని తనకు ప్రేమ , పెళ్లి పైన మంచి ఒపీనియన్ లేదంటూ వెల్లడించింది. బ్రేకప్ మళ్లీ లవ్ వంటివి తన జీవితంలో అసలు వద్దని ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ లాగా ఒకరు ఉండేవారు.. కానీ ఇప్పుడు లేడు అని తనకు తన కుటుంబమే ఇంపార్టెంట్ అని వాళ్లకోసమే తాను బ్రతుకుతున్నానంటూ తెలియజేసింది వర్ష.
కానీ జబర్దస్త్ స్కిట్ లో చేస్తున్న సమయంలో ఇమ్మాన్యూయేల్ తో లవ్ ట్రాక్ షో వల్ల రూమర్స్ చాలానే వినిపించాయి. దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే విధంగా పలు రకాల రూమర్స్ వినిపించాయి.. అవన్నీ కూడా కేవలం షో కోసమే చేశామంటూ తెలిపింది వర్ష. ఇప్పుడు మొత్తానికి వివాహం చేసుకోనంటూ బిగ్ బాంబ్ పేల్చి అభిమానులను నిరాశకు గురిచేసింది. మరి నిజంగానే వర్ష సింగిల్ గా ఉంటుందా ఫ్యూచర్లో ఏదైనా మనసు మార్చుకొని మరి వివాహ బంధంలోకి అడుగు పెడుతుందా అనే విషయం చూడాలి మరి. వర్ష చేసిన కామెంట్స్ కు పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీల మనసు మారుతూ ఉంటుంది.. జనాలను వెర్రి పుష్పాలను చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.