కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే కింగ్ నాగార్జున  , రష్మిక మందన్నా వంటి కీలక నటుల కాంబోలో సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ సినిమా కుబేర .. ఇప్పటికే ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయి లో భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ కంటే ముందే కుబేర భారీ రన్ టైం తో రాబోతుందని ఒక టాక్ బయటికి  వచ్చింది .. అయితే ఇప్పుడు ఫైనల్ గా అఫీషియల్ రన్ టైం పై కుబేర క్లారిటీ ఇచ్చేసింది . ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు గా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు .. అయితే ఈ సినిమా చూశాక సెన్సార్ యూనిట్ వారు యూ/ ఏ సర్టిఫికెట్ ని కూడా ఇచ్చారు .. ఇక దీంతో పాటు గా ఈ సినిమా అధికారిక రన్ టైం కూడా దీంతోనే రివిల్ చేశారు ..
 

ఇక ఈ సినిమా ఇదివరకు 3 గంటల 15 నిమిషాలకు అలా ఉంటుందని టాక్ బయటకు వచ్చింది .. అలా వచ్చిన విధంగానే మూడు గంటలకు పైగా ఈ సినిమాని కట్ చేశారు .. ఏకంగా 3 గంటల 1 నిమిషం నిడివి తో కుబేర ప్రేక్షకుల ముందుకు రావడాని కి సిద్ధమవుతుంది .. ఇక అంతసేపు ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలంటే జూన్ 20 వరకు ఎదురు చూడాల్సిందే .. ఇక ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అమిగోస్ సినిమాస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు . చాలాకాలం తర్వాత శేఖర్ కమ్ముల సరికొత్త కథాంశం తో   ప్రేక్షకుల ముందుకు రావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి .. ఇక మరి శేఖర్ కమ్ముల అంచనాలకు ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: