
ఆ హీరోయిన్ తెలుగమ్మాయి నే ఒకప్పుడు సెకండ్ హీరోయిన్గా చేసింది ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ లీడ్గా చేస్తూ వస్తుంది . రీసెంట్ గానే ఒక పాన్ ఇండియా సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది . అభిమానులకి జనాలకి ఈ హీరోయిన్ అంటే మహా మహా ఇష్టం . కొంతమంది డైరెక్టర్ లు ప్రత్యేకంగా ఈ హీరోయిన్ ని పొగిడేస్తూ ఉంటారు. ఇక ప్రొడ్యూసర్స్ కి కూడా ఈ హీరోయిన్ బాగా కావాల్సిన మనిషి. చాలా సరదాగా అందరితోను ఉంటుంది. అయితే ఈమె ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విన్నాక నెటిజెన్లు కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు .
ఇందుకు కారణం ఒక బడా పొలిటికల్ లీడర్ అంటూ టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత కరువులో ఉన్నావేంటయ్యా సామీ.. పోయి పోయి ఈ అమ్మాయి నే దొరిక్కిందా నీకు..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు అందుకేనా నువ్వు ఆ హీరోయిన్ కి సంబంధించిన పాటలను మీ పొలిటికల్ పరంగా వాడుకుంటూ ఉంటావా..? అంటూ ఘాటుఘటుగా వీడియోలు వైరల్ చూస్తున్నారు . మరికొందరైతే ఏకంగా ఆ నేతకు ఆ హీరోయిన్ కు లింక్ పెట్టేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ పేరు బాగా వైరల్ గా మారింది. కేవలం ఈ హీరోయిన్ మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు బడా పొలిటికల్ స్టార్స్ వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఫోన్లో కూడా ట్యాప్ అయ్యాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ యవ్వారం చూస్తుంటే ఇంకా చాలామంది స్టార్స్ ఇందులో ఇరుక్కునేలా ఉన్నారు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు..!