
"మా" చిత్రానికి అజయ్ దేవగన్ , జ్యోతి దేశ్ పాండే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు . అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ నేపథ్యంలోనే సినీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది . అది కూడా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి కావడంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . "ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంలో రామోజీ ఫిలిం సిటీ ఒకటి " అంటూ "తన జీవితంలో అక్కడికి వెళ్లాలనుకోవడం లేదు " అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి .
కాజల్ మాట్లాడుతూ.." ఎందుకో తెలియదు రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి . కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు చాలా బాగుంటాయి. అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి . కొన్ని ప్రదేశాలు భయపెడతాయి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది . అక్కడికి మరోసారి రాకూడదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ కూడా అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది " అంటూ కాజోల్ చెప్పుకొచ్చింది . దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఆమె రామోజీ ఫిలిం సిటీపై అలాంటి కామెంట్స్ చేసింది ..? అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా..? అనే విధంగా సోషల్ మీడియా ద్వారా జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది అది ఓ దెయ్యాల కొంప అని .. కాజోల్ చెప్పకనే చెప్పేసింది అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఎవ్వడు అక్కడ సినిమా షూటింగ్ చేస్తాడు ..? అంటూ ఘాటుఘాటుగా స్పందిస్తున్నారు. కాజోల్ ఎందుకు రామోజీ ఫిలిం సిటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో అర్థం కావడం లేదు . ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఆడుతున్న హై డ్రామా అంటూ కొంతమంది కొట్టి పడేస్తున్నారు . ఇప్పటి వరకు అక్కడ ఎన్నో సినిమా షూటింగ్ లు జరిగాయి . ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలా మాట్లాడలేదు. కాజోల్ మాత్రమే ఇలాంటి నిందలు వేసింది. దీనిపై కాజోల్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి..!??