పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఫిల్మ్ `ది రాజా సాబ్`. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. థ‌మ‌న్‌ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కింద నిర్మితమవుతున్న రాజా సాబ్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.


రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. టీజర్ చూసి బొమ్మ బ్లాక్ బస్టర్ అని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. తాజాగా రాజా సాబ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ కు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట మారుతి. అయితే మొదట ఓ బాలీవుడ్ సాంగ్ ను రీమిక్స్ చేయాలని భావించిన‌ప్ప‌టికీ.. ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ దాదాపు రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట.


దాంతో వెన‌క్కి త‌గ్గిన రాజా సాబ్‌ నిర్మాతలు.. బీజీఎమ్ కింగ్ థ‌మ‌న్ తోనే మాస్ బీట్ తో ప్రత్యేక సాంగ్ ను కంపోజ్‌ చేయించాలని నిర్ణయించారట.
స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో దిట్ట అయిన థ‌మ‌న్ కూడా అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ విధంగా థ‌మ‌న్ రాజా నిర్మాత‌ల‌కు రూ. 5 కోట్లు సేవ్ చేశాడ‌ని అంటున్నారు. ఇక మ‌రి ప్రభాస్ కోసం థ‌మ‌న్‌ ఎలాంటి బిట్స్ అందిస్తాడో చూడాలి. కాగా, రాజాసాబ్ లో తాత‌య్య‌, నాన‌మ్మ‌, మ‌న‌వ‌డి క‌థ‌ను చూపించ‌బోతున్నారు. ఇదొక ఎమోష‌న‌ల్ ఫిల్మ్ అని.. ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతార‌ని డైరెక్ట‌ర్ మారుతి చెబుతున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: