
ఇంతకు ఈమె ఎవరు అంటే ? చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది .. ఇంతకి ఈమె మరెవరో కాదు అందాల బ్యూటీ రితిక సింగ్ .. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన గురు సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రితిక .. ఇక ఈ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది తొలి సినిమానే అయినా .. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది రీతిగా .. అయితే ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు ఓ గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ కూడా చిన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు క్రీడలు అంటే ఎంతో ఇష్టం అంతే కాకుండా ఈమె బాక్సర్ కూడా . ఇక బ్యూటీ 2009 లో ఏసియా ఇండోర్ గేమ్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది ..
అలాగే సూపర్ ఫైట్ లీగ్ ను కూడా గెలిచింది . వీటి తర్వాత ఆమె సుధా కొంగర దర్శకత్వం వహించిన “ఇరుతి చూడ్” సినిమాలో ప్రధానపాత్రలో నటించి చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది .. ఈ సినిమానే తెలుగులో గురు టైటిల్ తో రీమేక్ చేశారు . అయితే మొదటిలో నటన పై అంతగా ఆసక్తి చూపించిన రీతిక తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకుంది. తొలి సినిమానే భారీ విజయం సాధించడంతో .. స్పోర్ట్స్ తో పాటు ఆమె సినిమాల్లో కూడా నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపించింది .. అలాగే రజనీకాంత్ ,రాఘవ లారెన్స్, మాధవన్ ,విజయ్ సేతుపతి ,దుల్కర్ సల్మాన్ ,విజయ్ ఆంటోనీ వంటి దిగ్గజ నటులతో బ్యూటీ నటించింది .. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది .