టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల కుబేర సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో శేఖర్ కమ్ముల ఒక రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల సాయం చేశారు. అయితే ఈ సాయం గురించి పెద్దగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడని శేఖర్ కమ్ముల తాజాగా ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూతురికి పెళ్లి చేద్దామని ఒక రైతు దాచుకున్న డబ్బులు అగ్నిప్రమాదంలో కాలిపోయాయని ఆ సమయంలో నా కళ్ళలో నీళ్లు తిరిగాయని చెప్పుకోచ్చారు.

కూతురు పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బులు కాలిపోవడంతో  నేను బాగా ఎమోషనల్ అయ్యానని  ఆయన చెప్పుకొచ్చారు.  బాగా డబ్బున్నోడి  నోట్ల కట్టలు  మంటల్లో కాలిపోతేనే బాధేస్తుందని  ఆయన తెలిపారు.  అలాంటిది ఇది పేదోడి డబ్బు అని  అది కూడా  ఎంతో  కష్టపడి  సంపాదించారని  ఆయన అన్నారు.  ఆ రైతు  బాధేంటో  నాకు అర్థమైందని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

కరోనా సమయంలో  పారిశుధ్య కార్మికులకు తన వంతు సహాయం చేశానని  ఆయన తెలిపారు.  శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్  అమిగోస్ ద్వారా సైతం పలు సేవలు అందించారు.  గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వాళ్లకు  శేఖర్ కమ్ముల భోజనం అందించారు.   అయితే 10 పైసలు దానం చేసి  ఎంతో  ప్రచారం చేసుకునే ఈ రోజులలో  శేఖర్ కమ్ముల మాత్రం  ఈ విషయాలను  ప్రచారం  చేసుకోవడానికి  ఇష్టపడలేదు.

ఈ  ఒక్క విషయంలో శేఖర్ కమ్ములను ఎంత మెచ్చుకున్నా  తక్కువేనని చెప్పవచ్చు.   కుబేర సినిమాకు ఏపీలో  టికెట్ రేట్ల పెంపునకు  సంబంధించి అనుమతులు లభించాయి.   తమిళనాడులో మాత్రం  ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది.  అక్కడ కొన్ని ఏరియాలలో  బుకింగ్స్ ఇంకా  మొదలుకాలేదు.   కుబేర మూవీ  బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: