ధనుష్, నాగార్జున కాంబినేషన్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన కుబేర మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ప్రదర్శితం కాగా ఈ సినిమాలో స్టార్ హీరో ధనుష్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని తెలుస్తోంది. ధనుష్ తప్ప ఇలాంటి పాత్రను మరే నటుడు చేయలేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సిబిఐ  ఆఫీసర్  పాత్రలో  నాగ్ నటన అద్భుతంగా  ఉందని  హీరోయిన్  రష్మికకు  అదిరిపోయే పాత్ర  దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   సినిమా నిడివి కొంతమేర  తగ్గించి ఉంటే  బాగుండేదని  కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.  శేఖర్ కమ్ముల సినీ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో  ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ  మాత్రం సందేహం అవసరం  లేదు.

దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం, బీజీఎమ్  ఈ సినిమా రేంజ్ ను పెంచాయి.  2025 బెస్ట్ సినిమాలలో కుబేర ఒకటిగా నిలుస్తుందని  చెప్పడంలో  సందేహం అవసరం లేదు. ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఈ సినిమాకు ఒక విధంగా  ప్లస్ అయిందని  చెప్పడంలో  సందేహం అవసరం లేదు.  కుబేరకు 3 నుంచి 4.5 రేటింగ్  ఇస్తుండగా  ఈ స్థాయిలో  రేటింగ్  అంటే సినిమా కమర్షియల్ హిట్ అని  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కుబేర సినిమా  కలెక్షన్ల విషయంలో  ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  అన్ని  భాషల్లో ఈ సినిమాకు   పాజిటివ్ రివ్యూలు  వస్తున్నాయి. ప్రమోషన్స్ లో  వేగం పెంచితే  ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 60  కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఆ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు రాబడుతుందో లేదో  చూడాల్సి ఉంది.


https://x.com/rameshlaus/status/1935864856537976936

 

మరింత సమాచారం తెలుసుకోండి: