
క్లాస్ డైరెక్టర్ తో మాస్ హీరో . అది కూడా నాగార్జున లాంటి సీనియర్ హీరో మరొక కీలకపాత్రలో. వేరే లెవెల్ కాంబో ఇది అంటూ జనాలు మాట్లాడుకున్నారు. జనాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంచ్ కూడా తగ్గకుండా చాలా చాలా పక్కాగా క్లారిటీగా తెరకెక్కించాడు ఈ సినిమాని శేఖర్ కమ్ముల అని చెప్పడంలో సందేహమే లేదు . సినిమాకి ప్రతి ఒక్క చోట పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా శేఖర్ కమ్ముల రాసిన కథ అద్భుతంగా ఉంది అని .. ధనుష్ పర్ఫామెన్స్ ఇంకా అద్భుతంగా ఉంది అని జనాలు మాట్లాడుతున్నారు.
అంతేకాదు ధనుష్ రేంజ్ క్రేజ్ ఈ సినిమా ద్వారా మరింత పెరిగిపోయింది అని చెప్పడంలో సందేహమే లేదు . సినిమాలో ధనుష్ క్యారెక్టర్ కి ఎంత హై ఇంపార్టెన్స్ ఉందో సేమ్ నాగార్జున క్యారెక్టర్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాలో నాగార్జున పాత్ర చాలా చాలా కీలకం . అయితే ఇంత మంచి పాత్రను శేఖర్ కమ్ముల ముందుగా మెగాస్టార్ చిరంజీవి కోసం అనుకున్నారట . ఆయన అయితే ఈ సినిమాలో ఇంకా బాగుంటుంది అంటూ ఇంటికి వెళ్లి కథ కూడా వినిపించారట . కానీ ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా కి కమిట్ అయిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ కాల్ షీట్స్ ఇచ్చేశాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి తో కూడా సినిమాకి కమిట్ అయిపోయాడు . కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిన కారణంగానే కథ నచ్చిన చిరంజీవి ఈ రోల్ ని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట . ఒకవేళ నిజంగానే చిరంజీవి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం నో డౌట్ సినిమా ఇప్పుడు అందుకున్న టాక్ కన్నా 100 రెట్లు టాక్ ఎక్కువగా అందుకునేది అని చెప్పాలి . జస్ట్ మిస్ . నెక్స్ట్ టైం ఇలాంటి క్రేజీ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో అంటున్నారు అభిమానులు . ఈ సినిమా మొదటిరోజు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు..!!