
మరొకసారి సోషల్ మీడియాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే . అసలు ఆయన సినిమాలకి మ్యూజిక్ సరిగ్గా ఇవ్వడం లేదని ఫెడ్ అవుట్ అయ్యాడు అని ..ఆయన అసిస్టెంట్ ల దగ్గర మ్యూజిక్ కి సినిమాలకి ఇప్పిస్తున్నాడు అని .. పెద్ద సినిమాలకి మాత్రమే అయన మ్యూజిక్ ఇస్తున్నాడు అని రకరకాల రూమర6స్ వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమా టైం లో ఆయనపై ఎలాంటి నెగిటివిటీ వచ్చిందో కూడా అందరికీ తెలిసిందే.
అయితే అదంతా తుడిచిపెట్టుకుపోయేలా తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సినిమాలోని పాటలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి . ప్రతి ఒక్కరు కూడా పాటలన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే వచ్చిన తండేల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ పరంగానే కాదు సినిమా పరంగా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన "కుబేర" సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యింది. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నాగార్జున కీలకపాత్ర రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ కుబేర సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డును బ్లాస్ట్ చేస్తుంది . మరీ ముఖ్యంగా మ్యూజిక్ పరంగా ఈ సినిమా మంచి కామెంట్స్ దక్కించుకుంది . ప్రస్తుతం సౌత్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న అనిరుధ్ రవిచంద్రన్ తో పాటు ధమన్ కూడా హ్యాట్రిక్ హిట్స్ కొట్టలేకపోయారు . అలాంటిది దేవిశ్రీప్రసాద్ వరుసగా పుష్ప2 ..తండేల్.. కుబేర వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు . సోషల్ మీడియాలో ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ పేరు మారుమ్రోగిపోతుంది..!!