సినిమాలు చూడడానికి థియేటర్లకు వచ్చే జనం రోజురోజుకు తగ్గిపోతున్న పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ ఉనికే ప్రమాదంగా మారుతున్న సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి .  ఈమధ్య సక్సెస్ రేట్ అంత‌కంత‌కూ  పడిపోవటం .. స్టార్లు  ఉన్న సినిమాలుకు పైగా ఓపెనింగ్స్ రాకపోవడం చిన్న సినిమాలను అసలే పట్టించుకోకపోవడం చూసి ఇండస్ట్రీ జనాలు తెగ భయపడిపోయారు .. ఒకప్పుడు క్రేజీ సీజన్ అయినా సమ్మర్ లో సరైన సినిమాలు లేక థియేటర్లు తెగ వెలబల పోయాయి .. హిట్ 3 , సింగిల్ సినిమాల తర్వాత నెలరోజుల పాటు బాక్సాఫీస్ అసలు బోసిపోయింది .  జూన్ నెల ఆశాజ‌న‌కంగా కనిపించింది కానీ తొలి వారం వచ్చినం థ‌గ్ లైఫ్ డిజాస్టర్ కావడం తర్వాతి వారం రావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడటంతో ఈనెల కూడా వేస్ట్ అన్న అనుమానాలు వచ్చాయి .


అయితే మంచి సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నా .. వారి కోరిక ఆశ తీర్చే మూవీ లేక ఉసురుమనే సిచువేషన్ .. ఇలాంటి సమయంలో శేఖర్ కమ్ముల అందరి కరువు ఆకలి తీర్చేశాడు .  ధనుష్ , అక్కినేని నాగార్జున , రష్మిక ప్రధాన పాత్రలో శేఖర్ తెర్కక్కించిన కుబేర మళ్లీ థియేటర్లో మంచి సందడి తీసుకువస్తుంది .. చాలా రోజుల తర్వాత మళ్లీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి .. ఇక ఈరోజు ఆన్లైన్లో ఉదయం నుంచి సాయంత్రం షో లని ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ లోకి వచ్చేసాయి .. సోల్డ్ అవుట్ షోలు గట్టిగా కనిపిస్తున్నాయి .. మళ్లీ ఇలాంటి సందడి కనిపించడంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఆనందపడుతుంది .

 

అయితే ఇక్కడ నిజానికి కుబేర కి కూడా కొన్ని రోజుల ముందు పెద్దగా అంచనాలు లేవు .. కంటెంట్ మరి సీరియస్ గా కనిపించడంతో ఇది ఏమాత్రం మెప్పిస్తుందో అన్న అనుమానాలు ఆంద‌రిలో కలిగాయి .. ప్రధానంగా తమిళం లో అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా సరిగా జరగలేదు .. తెలుగులో పరిస్థితి కొంచెం మెరుగ్గా కనిపించిన సినిమా ఎలా ఉంటుందో అన్న సందేహాలు అందరిలో వెంటాడాయి .. కానీ సినిమా అంచనాలు మించి ఉండడంతో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది .. రివ్యూలు కూడా అదిరిపోయాయి కూడా చాలా బాగా వచ్చింది .. ఇలా యునానిమస్ పాజిటివ్ టాక్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకు వెళ్లే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి ..  అలాగే ధనుష్ కెరీర్‌ లోనే ఇది బిగ్గెస్ట్ విజయంగా నిలవడం ఖాయం .. నాగార్జునకు కూడా ఇది మంచి విజయాన్ని ఇవ్వడం కాయంగా కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: