గత కొన్నేళ్ల‌ నుంచి టాలీవుడ్ లో చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా టర్న్ అవుతున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని ఇలా టాలీవుడ్ లో హీరోస్ కమ్ ప్రొడ్యూసర్స్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ బాట‌లోనే ఉస్తాద్ రామ్ పోతినేని కూడా వెళ్ళబోతున్నాడట. నిర్మాతగా మారబోతున్నాడట. ప్రస్తుతం రామ్ `ఆంధ్ర కింగ్ తాలూకా` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` వంటి క్లాస్ హిట్ ను తెరకెక్కించిన మహేష్ బాబు. పి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌గా.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రామ్ త్వరలోనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించబోతున్నాడట‌. రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ బడా నిర్మాత. ఆయన బ్యానర్ `స్రవంతి మూవీస్` లోనే రామ్ ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు సపరేట్‌గా రామ్ సొంత నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నాడ‌ని.. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.


రామ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోయే తొలి చిత్రంతో ఓ యువ దర్శకుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడట‌. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది అని కూడా టాక్ నడుస్తోంది. కాగా, నిర్మాత‌లుగా మారిన హీరోల్లో కొందరు సూపర్ సక్సెస్ అవ్వ‌గా.. మ‌రికొంద‌రు సినిమాలపై డబ్బులు పెట్టి చేతులు కాల్చుకున్నారు. మ‌రి రామ్ నిర్మాత‌గా స‌క్సెస్ అవుతాడా? లేదా? అన్న‌ది చూడాలి. ఒకవేళ తేడా వ‌స్తే మాత్రం నిర్మాణ రంగంలో దూల తీరిపోతుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: