
హీరోయిన్ త్రిష టాలీవుడ్ హీరో అయిన మహేష్ బాబు ఇద్దరూ కూడా ఒకే క్లాస్మేట్స్ అట.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు తాను చెన్నైలో కాలేజ్ ఫ్రెండ్స్ అని వెల్లడించింది. ఫ్రెండ్స్ ద్వారా మహేష్ బాబు పరిచయమయ్యారని తెలిపింది.ఆలా వీరిద్దరికీ కూడా పరిచయం ఉందని వెల్లడించింది. తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరని తెలియజేసింది. కానీ అలా స్నేహితులగా ఉన్న సమయంలో ఇద్దరు యాక్టర్స్ అవుతామని ఊహించుకోలేకపోయానని తెలియజేసింది. మహేష్ బాబుతో నటించడం కూడా తనకు చాలా ఇష్టమని తెలిపింది త్రిష.
వీరిద్దరి కాంబినేషన్లో సైనికుడు సినిమా వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో త్రిష పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. కానీ వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. త్రిష సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఇటీవలే కమలహాసన్తో నటించిన థగ్ లైఫ్ సినిమా థియేటర్లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అజిత్ తో నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకున్నట్లు సమాచారం. ఇక తెలుగులో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది త్రిష.