
ఈ సినిమాలో సమీరా పాత్రలో రష్మిక అద్భుతంగా ఆకట్టుకున్నారు. సాధారణంగా హీరోయిన్ రోల్ అంటే హీరోతో పాటు పాటలు ఉంటాయి. అయితే రష్మిక మాత్రం ఈ సినిమాలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. కుబేర సక్సెస్ గురించి రష్మిక మాట్లాడుతూ సమీరా ఒక అందమైన గందరగోళం అని చెప్పుకోచ్చారు. దర్శకుడు శేఖర్ కమ్ముల వల్లే సమీరా పాత్రలో ఆ విధంగా ఒదిగిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. వృత్తిపై శేఖర్ కమ్ములకు ఉన్న ప్రేమ తన సినిమాలలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుందని రష్మిక పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల నటిగా నాకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను ఇచ్చారని ఆయన చెప్పిన విధంగా ప్రతి సన్నివేశంలో యాక్ట్ చేశానని ఆయన వల్లే నా పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయని పేర్కొన్నారు.
ధనుష్ లాంటి గొప్ప నటుడి పక్కన యాక్ట్ చేస్తున్న సమయంలో ప్రతి సన్నివేశంలో శ్రమించాల్సిందే అని రష్మిక వెల్లడించారు. నాగార్జున సార్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవని నాగార్జున గారి నుంచి నేనెంతో స్ఫూర్తి పొందానని ఒక మాటలో చెప్పాలంటే నాగార్జున ది బెస్ట్ అని రష్మిక కామెంట్లు చేశారు. నాగార్జున గారి జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని రష్మిక చెప్పుకొచ్చారు.
కుబేర సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని రష్మిక వెల్లడించారు. 2025 బెస్ట్ సినిమాలలో కుబేర ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రష్మిక కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుబేర సినిమా కలెక్షన్ల పరంగా కూడా సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. రియల్ లొకేషన్ లలో షూట్ చేయడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.