
దర్శకధీరుడురాజమౌళి , మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తూ నిర్మించబోతున్నారు .. అలాగే ఈ సినిమా లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై రోజుకొక రూమర్ బయటకు వస్తూనే ఉంది .. అయితే ఇప్పుడు తాజా బజ్ ప్రకారం వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్ చేయబోతున్నారట .. అలాగే ఈ సీక్వన్స్ కోసం మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతుంది .. ఇక వీరిద్దరి పాత్రల పరిచయాల తో పాటు కథ తాలూకు గమనాన్ని కూడా ఈ సీక్వెన్స్ లో రివిల్ చేస్తారని అంటున్నారు ..
అయితే రీసెంట్ గా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ప్రధానంగా నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం .. అందుకే ఆయన పుస్తకాల ఆధారం గానే ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారు చేశామంటూ చెప్పుకొచ్చారు .. అయితే ఇప్పుడు రాజమౌళి , మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతుంది .. అలాగే ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు . రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించ గా మరో డైరెక్టర్ దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు