
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపిస్తుండగా ఆ లుక్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు బ్రాండ్ అనే సంగతి తెలిసిందే. పవన్ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి. రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తేరి సినిమాకు రీమేక్ అయినా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
పవన్ కు జోడీగా శ్రీలీల ఈ సినిమాలో నటిస్తుండగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. భవిష్యత్తులో పవన్ సీఎం కావాలని అభిమానుల ఆకాంక్ష కాగా ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. వైట్ అండ్ వైట్ పంచె, షర్ట్ పై బ్లాక్ గాగుల్స్ తో పవన్ నడుస్తున్న ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. పవన్ ధరించిన చెప్పుల ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ చెప్పులు నిక్ కామ్ బ్రాండ్ కు సంబంధించిన చెప్పులు కాగా 7,000 రూపాయలు కావడం గమనార్హం. లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నా పవన్ మాత్రం తక్కువ ఖరీదైన చెప్పులే కొనుగోలు చేశారు. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.