టాలీవుడ్ యం గ్ హీరో విజ య్ దేవర కొండ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత ఈయన నటించిన సినిమాల్లో అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా సినిమాలు మంచి విజయాలు సాధించడం తో ఈయన క్రేజ్ చాలా వరకు పెరిగి పోయింది . ఈ మధ్య కాలంలో మాత్రం విజ య్ కి మంచి విజయాలు దక్కడం లేదు. ఈయన నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి భాగాన్ని జులై 25 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తన తదుపరి మూవీ కి లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ , విజయ్ కి ఓ కథను వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో శేఖర్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ కెరియర్ ప్రారంభంలో శేఖర్ దర్శకత్వంలో రూపొందిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సమయంలో విజయ్ కో పెద్దగా గుర్తింపు లేదు. ఇక ఇప్పుడు శేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో విజయ్ హీరోగా నటించబోటినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd