కోలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ స్టార్ట్ చేయడానికి ముందే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ రాజకీయ పార్టీని కూడా స్టార్ట్ చేశాడు. దానితో తమిళనాడులో ఎన్నికలు వచ్చే ముందు ఒక సినిమా చేయాలి అనే ఉద్దేశంతో విజయ్ "జన నాయగన్" అనే మూవీ ని మొదలు పెట్టాడు.

సినిమా తర్వాత సినిమాలకు విజయ్ దూరంగా ఉంటాడు అనే వార్తలు కూడా బలంగా వచ్చాయి. అందుకు అనుగుణం గానే ఇప్పటివరకు జన నాయగన్ అని సినిమా తర్వాత ఏ మూవీ కి కూడా విజయ్ గ్రీన్ ఇవ్వలేదు. దానితో ఆయన అభిమానులు కూడా ఈ విషయంలో విజయ్ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్న కాస్త సమయం దొరికినప్పుడు ఏదో ఒక సినిమా చేసి విడుదల చేస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న జన నాయగన్ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటిస్తోంది.

యంగ్ బ్యూటీ మమత బైజు ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ బ్యూటీ విజయ్ గురించి మాట్లాడుతూ ... నేను కొంత కాలం క్రితం విజయ్ సార్ ని జన నాయగన్ మీ చివరి సినిమానా సార్ అని అడిగాను. దానికి విజయ్ గారు నాకు తెలియదు. అదంతా ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పినట్లు మమత తాజాగా చెప్పుకొచ్చింది. ఇలా మమత చెప్పిన అప్డేట్ తో విజయ్ జన నాయగన్ సినిమా తర్వాత కూడా మూవీలు చేసే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: