
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని, సమంత కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. అయితే మలయాళంలో లవ్లీ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఈగ సినిమాకు కాపీ అనేలా ఉండటం గమనార్హం. ఈగ సినిమాను కాపీ కొట్టి ఆ మలయాళ సినిమాను తీశారా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈగ సినిమాలో ఈగ ఏ విధంగా ఉందో ఆ సినిమాలో సైతం ఈగ అదే విధంగా ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఈగ మేకర్స్ మళయాళ లవ్లీ మూవీ టీమ్ కు నోటీసులు జారీ చేశారు. తమ కాన్సెప్ట్ ను కాపీ కొట్టారని ఈగ పాత్ర, రూపం, కదలికలను కాపీ చేసారని మేకర్స్ లీగల్ నోటిస్ ఇచ్చారు. అయితే ఈగ నిర్మాతల ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని లవ్లీ మేకర్స్ చెప్పుకొచ్చారు.
తాము ఈగను సొంతంగా డిజైన్ చేశామని ఇందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని లవ్లీ మేకర్స్ పేర్కొన్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడల్సి ఉంది. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడాల్లేకుండా అన్ని సినిమాలపై కాపీ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హిట్3 సినిమా కూడా కాపీరైట్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
కాపీ రైట్స్ కేసులు టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. గతంలో కూడా పలు సినిమాలు ఈ తరహా వివాదాల్లో చిక్కుకోగా ఆ వివాదాలకు సంబంధి కోర్టు కేసులు నడుస్తున్నాయి. శ్రీమంతుడు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు గతంలో ఈ తరహా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచాయి. టాలీవుడ్ హీరోలే తమ కథలను లీక్ చేస్తున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాపీరైట్స్ వివాదాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.