- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

కుబేర సక్సెస్ మీట్లో దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమా రెమ్యూనరేషన్ రిలీజ్ కి ముందు ఇచ్చేశారు .. అంతకంటే ఆనందం ఏముంటుంది ? అని నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడుతూ స్టేజిపై చిన్నపిల్లాడిలా గంతులు వేశాడు. దేవిశ్రీ రాజుగారి రెండో భార్య బాగుంది అంటే ... మొదటి భార్య ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు పారితోషకం ముట్టింది అంటే మిగిలిన నిర్మాతలు ఎగ్గొట్టినట్టే అర్థం. అయితే దేవిశ్రీకి అలా రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతలు ఎవరు అన్నది ? ఇప్పుడు చర్చనీయాంశం. దేవి శ్రీ టాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే సంగీత దర్శకులలో ఒకరు. అలాంటి వ్యక్తికి పారితోషంలో కోత విధించడం కష్టమే. అయితే ఇటీవల అగ్ర నిర్మాణ సంస్థ దేవిశ్రీకి భారీగా పెండింగ్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది .సదరు నిర్మాణ సంస్థతో దేవీ కి కాస్త ఇబ్బందికర పరిస్తితి తలెత్తిందట.


దేవి తన ఔట్పుట్ చాలా ఆలస్యం చేశాడని ... అందుకే నిర్మాతలు తనపై గుర్రుగా ఉండే వారిని ... ఆ కారణంతోనే పారితోష‌కంలో కొంత ఆపేసారని .. అందుకే దేవి ఇలాంటి కామెంట్లు చేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పారితోషికం ఇవ్వ‌డ‌మే కాదు. నా పాట‌లూ బాగున్నాయ‌ట‌. నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంద‌ట అని కూడా దేవీ అన్నాడు. అంటే పారితోష‌కం ఇవ్వ‌కుండా త‌న పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేద‌ని నిర్మాత‌లు చెప్పి ఉండొచ్చు.. అందుకే దేవి ఇప్పుడు వాళ్ల‌పై సెటైర్లు వేశాడంటున్నారు. గతంలో పుష్ప సినిమా ఈవెంట్‌లో కూడా దేవి నిర్మాత‌ల మీద ఓపెన్‌గానే త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: