
రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో విశ్వక్‌సేన్ ద్విపాత్రాభినయం చేశాడు. అందులో సోనూ క్యారెక్టర్ ఒకటి కాగా.. మరొకటి లైలా అనే అమ్మాయి పాత్రను పోషించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మించిన లైలా మూవీ ఈ ఏడాది లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
తొలి ఆట నుంచే సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో.. టార్గెట్‌లో సగం వసూళ్లను కూడా లైలా రాబట్టలేకపోయింది. విశ్వక్ కేరీర్‌లో బిగ్ ఫ్లాప్‌గా నిలిచింది. లైలా రిజల్డ్ విషయంలో తన ఫ్యాన్స్ కు క్షమాపణ కూడా చెప్పిన విశ్వక్.. ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తానని హామీ ఇచ్చాడు. అయితే నిజానికి లైలా మూవీకి ఫస్ట్ ఛాయిస్ విశ్వక్ సేన్ కాదు. అతని కన్నా ముందు టాలీవుడ్ కు చెందిన నలుగురు హీరోల వరకు లైలా స్టోరీ వెళ్లింది. హీరో లేడీ రోల్ లో కనిపించాల్సి ఉండడంతో వారంతా రిజెక్ట్ చేశారట. ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఆ రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరన్నది మాత్రం తెలపలేదు. ఏదేమైనా ఆ నలుగురు హీరోలు సేఫ్ అయ్యారు.. విశ్వక్ మాత్రం అడ్డంగా బుక్కైపోయారు.