తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో ఎస్ ఎస్ తమన్ ఒకరు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సంగీత దర్శకులలో తమన్ తో పాటు అనిరుద్ కూడా కొనసాగుతున్నాడు. చాలా మంది అనిరుద్ సంగీతం అద్భుతంగా ఉంటుంది అని , ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రేంజ్ లో ఇస్తాడు అని , ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే చాలా సినిమాలు విజయాలు కూడా అందుకున్నాయి అని అభిప్రాయాలను వ్యక్తం చేసిన జనాలు అనేక మంది ఉన్నారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో తమన్ దాదాపు ప్రతి సినిమాకు సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా సినిమాలు మంచి స్థాయికి వెళుతున్నాయి. కొంత కాలం క్రితం బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలతో పోలిస్తే తమన్మూవీ కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించాడు.

సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే అద్భుతమైన రేంజ్ లో ఎలివేట్ కూడా అయింది. ఇకపోతే తమిళ నటుడు తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భగవంత్ కేసరి మూవీ కి రీమేక్ గా రూపొందుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన గ్లీమ్స్ వీడియో విడుదల అయింది. ఇందులో అనిరుద్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పోలిస్తే భగవంత్ కేసరి మూవీ కి తమను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: